ఆగష్టు 5, 2017 తేదీన శ్రీ జ్యేష్ఠా లక్ష్మీ సమేత శనేశ్వర చక్రవర్తికి కళ్యాణం - శ్రావణ మాసం శుక్ల పక్షం చతుర్ధశి సంధ్య పౌర్ణమి తిధి నాడు లోక కల్యణార్థం కళ్యాణం జరుగును. కావున తామెల్లరిని ఆహ్వానించడమైనది
క్షేత్ర పూర్వం
ఫూర్వం సుమారు 150 సంవత్సరాల క్రితం ఒక భక్తురాలు స్వర్గీయ. ఆములురు సుబ్బమ్మ శివ సాధువులచె మేధా గురు దక్షిణా మూర్తిని లొక కల్యాణార్థం ప్రతిష్థ చెయబడినది.
కొంత కాలం సుమారు 60 సంవత్సరాలు శిథిలావస్థ లో ఉన్నది.
క్షేత్ర మహిమ
మూగ జీవులకు భిక్ష :: కాకి, కుక్క, జల పుష్పాలు, చీమలు, గోవు తదితర మూగ జీవులు భక్తికి అనుసందానమైన సంకల్పం.
ఏ గుడి లోను లేని క్రమము ఈ క్షేత్రం లో మూగ జీవుల భిక్షతో ప్రారంభమవుతుంది.
ఈ క్రమం వలన శని దేవునికి, ఈశ్వరునికి ప్రీతికరమవుతుంది.
క్షేత్ర క్రమం
మంగళ వారం - యమగండ కాలం- అభిషిత్ లగ్నమున పంచముఖ పరమేశ్వరునికి అభిషేకము జరుగును.
శ్రీ జ్యేష్ఠా లక్ష్మీ సమేత శనేశ్వర చక్రవర్తికి అభిషేకాలు, నాగవల్లి నాగకన్య సమేత రాహువుకు కళ్యాణం, శ్రీ గంగా-దాక్షాయణి సమేత మేధా గురు దక్షిణాముర్తికి ఆభిషేకం,
పితృ నివృత్తి పూజలు మరియు ఆన్నదానం జరుగును.
సూర్య గ్రహణం నాడు రాహువుకు ప్రత్యేక పూజలు, చంద్ర గ్రహణం నాడు కేతువుకు ప్రత్యేక పూజలు జరపబడును.
శని వారం - రాహు కాలంలో కర్రి(నలుపు) గోవుతో సిద్ధి-బుద్ధి, వల్లీ దేవసేనాధిపతి సమేత సుబ్రహ్మన్యేశ్వర స్వామికి, నాగవల్లి నాగకన్య సమేత రాహువుకు, శ్రీ జ్యేష్ఠా లక్ష్మీ సమేత శనేశ్వర చక్రవర్తికి
మరియు చిత్రలేఖ సమేత కేతువుకు, శ్రీ గంగా-దాక్షాయణి సమేత మేధా గురు దక్షిణాముర్తికి భూ ప్రదర్శన పూజ నిర్వహించబడును . తదుపరి శ్రీ జ్యేష్ఠా లక్ష్మీ సమేత శనేశ్వర చక్రవర్తికి అభిషిత్ లగ్నమున పసుపు, కుంకుమ, గంధం, విభుధి,సుగంధ ద్రవ్యాలతో మరియు తైలాభిషేకం జరుగును. గర్భగుడిలో గో ప్రదర్శనతో ఈ పూజా కార్యక్రమాలు జరుపబడును.
శ్రీ ఛాయా దేవి సమేత సూర్య భగవాన్ పుత్రుడు శని దేవుని జయంతి - వైశాఖ మాసం బహుళ పక్షం చతుర్ధశి సంధ్య అమావాస్య తిధి నాడు శనేశ్వర స్వామి వారి జన్మదినం జరుగును.
శ్రీ జ్యేష్ఠా లక్ష్మీ సమేత శనేశ్వర చక్రవర్తికి కళ్యాణం - శ్రావణ మాసం శుక్ల పక్షం చతుర్ధశి సంధ్య పౌర్ణమి తిధి నాడు లోక కల్యణార్థం కళ్యాణం జరుగును.
ప్రతి అమావాస్య నాడు పితృ దోష నివారణ పూజలు జరుగును. ఫూజా ప్రసాదాన్ని కాకి కి మరియు నల్ల గొవుకు నివేదించబడును. భాద్రపద అమావాస్య పితృ దోష నివారణకు ప్రాముఖ్యమైన రోజు. కావున విశేష పూజలు జరుగును.
ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుండి 7.30 నిమిషాల సమయంలో గంగా హారతి జరుగును.
ప్రదేశము
సంప్రదించు చిరునామా :
పెన్నా నదీ రుద్ర భూమి కర్మ నివృత్తి శని దేవుని మహిమ వాక్కు క్షేత్రం
ముదివర్తి గ్రామం, విడవలూరు మండలం ,నెల్లూరు జిల్లా - 524 318